Header Ads

ఒమిక్రాస్పై అప్రమత్తం విద్యాసంస్థలకు 8 నుంచే సంక్రాంతి సెలవులు JIPV •

 ప్రజలంతా కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలి . . ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి • 15 రోజుల్లో ఖాళీలు భర్తీ చేయాలి . . మరిన్ని నగరాలు , పట్టణాలకు బస్తీ దవాఖానాల విస్తరణ సీఎం కేసీఆర్ ఆదేశ ఈనాడు , హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16 వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు . గతంలో 11 నుంచి సంక్రాంతి సెల వులు ఇవ్వాలనుకున్నా .. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో మూడు రోజుల ముందే వాటిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . ఒమిక్రాన్పై ప్రజలు భయాందోళన చెందనవ సరం లేదని , నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు . పనిచేసే చోట్ల అప్రమత్తత పాటిస్తూ మాస్క్ లు ధరించాలని , నిబంధనలను విధిగా పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు . ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంద న్నారు . కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులన్నింటినీ పూర్తిస్థాయిలో మెరుగు పరచాలని .. పడకలు , ఆక్సిజన్ , ఔషధాలు పరీక్ష కిట్లను అవసరం మేరకు సమకూర్చు కోవాలని ఆదేశించారు . అన్ని దవాఖానాల్లో వైద్యులంతా అందుబాటులో ఉండాలని ఆదే శించారు . ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్ప డితే 15 రోజుల్లో భర్తీ చేసుకునేలా విధివిధా నాలు రూపొందించాలన్నారు 

No comments:

Powered by Blogger.