Header Ads

ఒమిక్రాన్ చికిత్సకూ ఆరోగ్య బీమా వర్తిస్తుంది • ఐఆర్డీఏఐ స్పష్టీకరణ

 ఈనాడు , హైదరాబాద్ : కొవిడ్ చికిత్సకు ఉపయోగపడుతున్న ఆరోగ్య బీమా పాలసీలు ఒమిక్రాన్ బాధితులకు ఉపయోగపడతాయని బీమా నియంత్రణ , అభివృద్ధి ప్రాధికార సంస్థ ( ఐఆర్డీఏఐ ) స్పష్టం చేసింది . సాధారణ , ఆరోగ్య బీమా సంస్థలు జారీ చేసిన అన్ని రకాల ఆరోగ్య బీమా పాలసీల్లో కొవిడ్ -19 చికి త్సకు పరిహారం ఇవ్వాలని ఐఆర్డీఏఐ ఏప్రిల్ 1 , 2020 న ఆదేశాలిచ్చింది . ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్న వేళ మరోసారి తన ఆదేశాలను గుర్తు చేస్తూ కొత్త వేరియంట్ చికిత్సకూ బీమా పరిహారం చెల్లించాల్సిందేనని సోమవారం బీమా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది . నగదు రహిత చికిత్సలకు సంబంధించి నెట్ వర్క్ ఆసుపత్రులతో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచిం చింది . బీమా సంస్థలతో ఉన్న ఒప్పందాల మేరకు పాలసీదారులకు నగదు రహిత చికిత్స అందించడంలో ఆసుపత్రులు సైతం తగిన సహకారం అందించాలని కోరింది .

No comments:

Powered by Blogger.