Header Ads

సరస్సుపై చైనా వంతెన DO • సైనికులు , ఆయుధాల సత్వర తరలింపునకు వీలు

 భారత బలగాలపై పైచేయి సాధించే ప్రయత్నం ఈనాడు , హైదరాబాద్ : భారత్ సరిహ ద్దుల్లో తన దూకుడును చైనా మరింత పెంచింది . తమ భూభాగంలో మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరుస్తోంది . ఇందులో భాగంగా తూర్పు లద్దాల్లోని పాంగాంగ్ సర స్సుపై ఓ కీలక వంతెనను ప్రస్తుతం నిర్మిస్తోంది . తాజాగా బయటికొచ్చిన ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి . అత్యవసర సమ యాల్లో సైనిక బలగాలు , ఆయుధ సామగ్రిని సరి హద్దులకు వేగంగా తరలించేందుకు వంతెన దోహదపడనుంది . దాని నిర్మాణం దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది . త్వరితగతిన పూర్తిచే సేందుకుగాను దాని నిర్మాణంలో ఫాబ్రికేటెడ్ పద్ధ తిని అనుసరిస్తున్నారు . 2020 జూన్ నాటి గల్వాన్ ఘర్షణల తర్వాత భారత సైన్యం పాంగాంగ్ సరస్సుకు దక్షిణం వైపు ఉన్న కీలక కైలాశ్ రేంజ్ పర్వత శిఖరాలను ఆక్రమించింది . అక్కడికి భారీగా బలగాలను తరలించింది . తద్వారా ఆ ప్రాంతంలో చైనా బలగాలపై పైచేయి సాధించింది . అప్పటి నుంచి అక్కడ పట్టు కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది . ఆ ప్రణాళికల్లో భాగంగానే తాజాగా వంతెన నిర్మా ణాన్ని తలపెట్టింది . డ్రాగన్ భూభాగంలోనే కుర్నాక్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై దాన్ని నిర్మిస్తున్నారు . ఇది అందుబాటులోకి వస్తే .. భారత సరిహద్దుల్లోని రుడోక్ వరకూ బలగాల | గల్వాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైనా దిల్లీ : కొత్త ఏడాది తొలి రోజునే గల్వాన్ లోయలో చైనా సైనికులు తమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు . తద్వారా ఆ లోయ తమదేనని వారు ప్రకటించినట్ల యింది . సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి . అయితే- ఇరు దేశాల మధ్య నిస్సై నీకరణ జోన్ ను చైనా అతిక్రమించలేదని భారత సైనిక వర్గాలు స్పష్టం చేశాయి . ఆ దేశ సైనికులు వారి భూభాగంలోనే జాతీయ పతాకాన్ని ఎగరేశారని తెలిపాయి . తరలింపు సులువవుతుంది . సమీపంలోని సైనిక శిబిరాల నుంచి డ్రాగన్ బలగాలను తరలించడా నికి ఇప్పుడు 180 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి వస్తోంది

No comments:

Powered by Blogger.