Header Ads

ఎవరి దారి వారిదే ! రహదారుల నిర్మాణంలో శాఖల మధ్య సమన్వయలోపం •

 హైదరాబాద్ - వరంగల్ ప్రయాణికుల కోసం కరుణాపురం వద్ద జాతీయ రహదారుల సంస్థ ( ఎన్హెచ్ఎఐ ) ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డును నిర్మించారు . ఒక మార్గం వరంగల్ నగరంలోకి , మరోమార్గం ములుగు వైపు వెళ్తాయి . ఈ రెండు మార్గాలు కలిసేచోట జంక్షన్ నిర్మించలేదు . దీంతో సర్వీస్ రోడ్డు ద్వారా వరంగల్ నగరంలోకి వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు . ఆ మార్గంలో పలు మలుపులను దాటి అండర్పస్ ద్వారా నగరంలోకి వెళ్లాల్సి వస్తోంది . ఈనాడు - హైదరాబాద్ ఒక శాఖ రోడ్డు వేస్తుంది .. మరో శాఖ వచ్చి తవ్విపోస్తుంది . పలుచోట్ల తరచూ జరిగే తతంగమిది . దీనివల్ల ప్రజలకు ఎన్నో అవస్థలు . రోడ్డు వేసేముందే అక్కడేమైనా కేబుల్ పనులు చేయాల్సి ఉందో .. లేకపోతే డ్రైనేజీ పనులు చేపట్టాల్సి ఉందో తెలుసుకోకపోవడం వల్ల వస్తున్న సమస్య ఇది శాఖల మధ్య సమన్వయలేమికి తార్కాణమిది . ఇప్పుడు రాష్ట్ర , జాతీయ రహదారులను నిర్మించే శాఖలు కూడా ఇదే తీరులో వ్యవహరిస్తున్నాయి . ఒకవైపు జాతీయ రహదారుల విస్తరణకు ప్రణాళికలు రూపొందుతుండగా మరోవైపు రాష్ట్రంలో రహదారులను నిర్మించే ఆర్ అండ్ బి మరికొన్ని రోడ్ల నిర్మాణం చేపడుతోంది . ఈ రెండుశాఖల మధ్య సమన్వయం లేకపోవడం . వల్ల .. జంక్షన్లు నిర్మించకపోవడం వల్ల చాలాచోట్ల బైపాస్ రోడ్లు సమస్యాత్మకంగా మారుతున్నాయి . లేదంటే వాటివల్ల ఆశించినంత ప్రయోజనం కలగడంలేదు . ఒకటి రెండు చోట్ల కాదు . ... మిగతా 3 లో ఆర్ఆర్ఆర్ అలైన్మెంటూ మారింది | హైదరాబాద్ నుంచి ముంబయి , పుణె , నిజా మాబాద్లకు సరకు రవాణా చేసే వాహనా న్నీ గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ మీదుగా వెళ్తుంటాయి . ఈ ట్రాఫిక్ నియంత్రణ కోసం శ్రీగిరిపల్లి శివారులో రాష్ట్ర రహదారులు , భవనాలశాఖ రింగురోడ్డు నిర్మిస్తోంది . ఇదే మార్గంలో జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ రింగురోడ్డు ( ఆర్ఆర్ఆర్ ) నిర్మిం చాలని ప్రతిపాదించింది . తీరా రింగురోడ్డు , ఆర్ఆర్ఆర్ ఒకచోట క్రాస్ అయ్యే పరిస్థితి ఏర్పడింది . దీంతో ప్రాంతీయ రింగు రోడ్డు గజ్వేల్ అవతల నుంచి వెళ్లేలా అలైన్ మెంటును మార్చాల్సి వచ్చింది .

No comments:

Powered by Blogger.